.కాని పెళ్లి అయిన వాళ్లకు కుదరదేమో అలా .నాకు చాలా నచ్చింది అలా ఉండటం .
పాట హిందీ పాటలు వింటూ ,వంట చేకుంటూ రోజంతా గడపటం కొత్త అనుభూతిని ఇచ్చింది .
.కాని పెళ్లి అయిన వాళ్లకు కుదరదేమో అలా .నాకు చాలా నచ్చింది అలా ఉండటం .
పాట హిందీ పాటలు వింటూ ,వంట చేకుంటూ రోజంతా గడపటం కొత్త అనుభూతిని ఇచ్చింది .
కొంత మందిని చాల మంచిది ,మంచోడు అంటారు .ఇది మంచిది ఇది చెడ్డది అన్న దానికి కొలమానం ఏంటసలు ?ఎవరి బాధ్యతా ఎవరు తీస్కోనపుడు ఒకరి గురుంచి ఫలానా మనిషి తాగుబోతని ,అన్నీ చెడ్డ అలవాట్లని ఎందుకో అనటం ?ఎవరైనా అమ్మాయీ సినిమాల్లో చేసేవాళ్ళని టీవీ లో చేసేవాళ్ళని ఎక్కువగా చెడ్డవాల్లంటారు .మరి ఎవరి జీవనాధారం వారిది ఎవరి ఉద్యోగం వాళ్ళది కాదూ .......
కొంతమంది అనవసరంగా లేని పోనివి ఊహించి మరీ అనుకుని సంతోష పడుతుంటారు .
ఎవరో కొంత మందిని చూసి ఆ ఉద్యోగం అంతే అనుకుంటారు చెడు అనిపిస్తే అది చేసే వాళ్లు కూడా నిజంగా చెయ్యరు .వాళ్లకు ఏర్పడ్డ అనుభవాల వల్లనో పరిస్తుతల వల్లనో అల మారున్టారేమో.
కొన్ని నెలల క్రితం జూనియర్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు వాళ్ల కష్టాలు ,బాధలు వింటే నాకనిపించింది .ఆవేశంగా మాట్లాడిన ముక్కురాజుగారు ఎందుకమ్మా అంట చులకన సినిమాల్లో డాన్సులు వేసే అమ్మాయిలంటే ఆడపిల్లలు ఆ డబ్బుతోనే వారి కుటుంబాన్ని పోషిస్తున్నారని ఆన్ని మాటలు అనే వాళ్లు వాళ్ల కుటుంబాలను ఆదుకుంటారా........
ఈ మధ్య జరిగిన సంఘటనల్లో రజియా సుల్తాన కేసు అందరికి తెలిసిన విషయమే .పెళ్లి చేసుకోవటమే ఒక్కటే లక్ష్యంగా ఎందుకు నిరాహార దీక్ష చెయ్యాలో నాకైతే అర్థం కాలేదు. ఒక పక్క రంగనాథ్ చెపుతూనే ఉన్నాడు పెళ్లి చేసుకోను అని ,అలా బలవంతంగా చేసుకొని ఎం లాభం? రేపు ఇష్టంగా కాపురం చెయ్యడు కదా ?పక్కాగా తెలుస్తూంది మోసం చేసాడని ,అలాంటప్పుడు వాడికి శిక్ష పడేలా చెయ్యకుండా వాడినే చేసుకుంటానని రజియా,పెళ్లి చేయిస్తామని మహిళా సంఘాలు కూడా ఎందుకు ప్రోత్సహిస్తున్నై ?మారాలి మారాలి మన మైండ్ సెట్ మారాలి !
ఈమె కాదు చాలమంది ఇలానే చేస్తున్నారు .ఇంకో విషయమేంటంటే ప్రతి సారి అమ్మాయినే తప్పు పడతారు ,కొంత మంది బాగా చదువుకున్నవారు కూడాను ,ఒక ప్రముఖ మహిళా నాయకురాలు కూడా నేను సపోర్ట్ చెయ్యను అని చెప్పింది పైగా ఆ అమ్మాయీ ఎందుకు తొందర పడాలి అన్నది కూడాను విచిత్రంగా!అంటే ప్రతి సారి అన్ని విషయాల్లోనూ అమ్మాయిలూ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని ఉండాలా? అది అబ్బాయిలకు వర్తించదేమో కదా !